అయోధ్య రామమందిర నిర్మాణంపై ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ కార్ఖానాలో అంబేడ్కర్ విగ్రహం వద్ద భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. కంటోన్మెంట్ భాజపా నాయకుడు మల్లికార్జున ఆధ్వర్యంలో పలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
సికింద్రాబాద్ కార్ఖానాలో భాజపా ఆందోళన - పరకాల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా భాజపా నిరసన
రాష్ట్రంలో పలు చోట్ల భాజపా కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణ నిధి సేకరణపై వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ... నేతలు క్షమాపణ చెప్పాలని నిరసన చేపట్టారు. సికింద్రాబాద్లో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు.
సికింద్రాబాద్ కార్ఖానాలో భాజపా ఆందోళన
రామ మందిరం విషయంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినదించారు. వరంగల్లో అరెస్టు చేసిన భాజపా నేతలను వెంటనే విడుదల చేయాలని... లేనిచో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు