ఎల్‌ఆర్‌ఎస్ ఉపసంహరించుకోవాలని, రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ల ముట్టడికి భాజపా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నగర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి కమల శ్రేణులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్ గేటు ఎక్కేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఫలితంగా కలెక్టరేట్ ఎదుట కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన భాజపా శ్రేణుల అరెస్ట్
ఎల్‌ఆర్‌ఎస్ ఉపసంహరణ, రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు కోరుతూ రాష్ట్ర భాజపా ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన భాజపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన భాజపా శ్రేణుల అరెస్ట్
ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలకు నష్టం వాటిల్లుతోందని.. తక్షణమే దీనిని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీచూడండి.. 'ఆరేళ్లు పూర్తయినా... 40వేలకు మించి నిర్మాణాలు జరగలే'