తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాసకు అనుకూలమైన వారికే వరదసాయం... బాధితులకు కాదు' - hyderabad latest news

వరద బాధితులకు న్యాయం చేయాలంటూ భాజపా నేతలు, బాధితులు డిమాండ్ చేశారు. వరద సాయం బాధితులకు కాకుండా తెరాసకు అనుకూలమైన వారికే ఇస్తున్నారని భాజపా నేతలు ఆరోపించారు. జీహెచ్​ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

bjp leaders and flood victims protest at ghmc office
'తెరాసకు అనుకూలమైన వారికే వరదసాయం... బాధితులకు కాదు'

By

Published : Nov 10, 2020, 3:41 PM IST

వరద బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ... భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఖైరతాబాద్​లోని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. షేక్ పేట్, ఫిలింనగర్ ప్రాంతాలకు చెందిన వరద బాధితులు తమకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకున్నారు. అసలైన బాధితులకు కాకుండా తెరాస పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే రూ.పది వేల ఆర్థిక సాయం అందిస్తున్నారంటూ భాజపా నాయకులు ఆరోపించారు. అధికారుల చుట్టూ బాధితులు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం అందే వరకు వెళ్ళేది లేదంటూ కార్యాలయం ద్వారం ముందు భాజపా నాయకులు, బాధితులు బైఠాయించారు. ఆందోళనకారులను పోలీసులు కార్యాలయం లోపలికి అనుమతించక పోవడంతో... ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చదవండి:వరద సహాయంపై గవర్నర్​కు ఫిర్యాదు చేసిన ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details