తెలంగాణ

telangana

ETV Bharat / state

'మునుగోడులో భాజపా గెలుస్తుందనే రాజగోపాల్‌ రెడ్డిపై తప్పుడు ప్రచారం'

Vivek Fires On KTR: రాజగోపాల్ రెడ్డి కంపెనీలపై మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను భాజపా నేత వివేక్ వెంకటస్వామి తిప్పికొట్టారు. మునుగోడులో భాజపా గెలుస్తుందనే కారణంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే 4 కాంట్రాక్టులు దక్కాయే తప్ప.. భాజపా ప్రభుత్వం వల్ల రాలేదన్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ గ్రహించాలని వివేక్ హితవు పలికారు.

Vivek Fires On KTR
Vivek Fires On KTR

By

Published : Oct 8, 2022, 3:36 PM IST

Updated : Oct 8, 2022, 3:58 PM IST

Vivek Fires On KTR: మంత్రి కేటీఆర్​పై భాజపా నేత వివేక్ వెంకటస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడులో భాజపా గెలుస్తుందనే.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు భాజపా అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి కంపెనీలపై కేటీఆర్ ఆరోపణలు సరికాదన్నారు. రాజగోపాల్‌ రెడ్డికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే 4 కాంట్రాక్టులు దక్కాయే తప్ప భాజపా ప్రభుత్వం వల్ల రాలేదని మంత్రి గ్రహించాలని వివేక్ వెంకటస్వామి అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఎక్కువ ధరకు ప్రాజెక్టులు కట్టబెడితే.. జెన్‌ కో, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.29 వేల కోట్ల నష్టం వాటిల్లిందని వివేక్ ఆరోపించారు. తప్పుడు ఆరోపణలపై విచారణకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. మునుగోడులో తెరాస ఓడిపోతుందనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి.. 82 మందికి బూత్‌ స్థాయిలో బాధ్యతలు అప్పగించారని ఎద్దేవా చేశారు.

సోమవారం రోజున నామినేషన్ దాఖలు కోసం రాజగోపాల్ రెడ్డి రిటర్నింగ్ అధికారిని సమయం అడిగినట్లు వెంకటస్వామి తెలిపారు. తెరాస ఎన్ని కుట్రలు పన్నినా మునుగోడులో గెలిచేది భాజపానేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మునుగోడులో భాజపా గెలుస్తుందనే రాజగోపాల్‌ రెడ్డిపై తప్పుడు ప్రచారం

"మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం కేటీఆర్​కి. రాజగోపాల్ రెడ్డిపై మీరు ఏవైతే ఆరోపణలు చేశారో వాటికి మేము సిద్ధంగా ఉన్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే రాజగోపాల్ రెడ్డికి టెండర్ వచ్చింది. మునుగోడులో మీరు ఓడిపోతున్నారనే భయంతోనే రాజగోపాల్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు." - వివేక్ వెంకటస్వామి, భాజపా నేత

ఇవీ చదవండి:రూ.18వేల కోట్లకు రాజగోపాల్​రెడ్డి అమ్ముడుపోయారు: జగదీశ్​రెడ్డి

టాపర్లకు హెలికాప్టర్ రైడ్.. హామీ నిలబెట్టుకున్న సీఎం.. విద్యార్థులు ఖుష్

Last Updated : Oct 8, 2022, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details