'ఫీడ్ ద నీడ్' అనే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్, లంగర్ హౌస్‌లో కార్వాన్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అమర్‌సింగ్ ఏర్పాటు చేసిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో మురళీధర్ రావు, ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మురళీధర్‌రావు - corona virus
హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్, లంగర్ హౌస్‌లో భాజపా సీనియర్ నేత మురళీధర్‌రావు వెయ్యి మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మురళీధర్‌రావు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలని భాజపా సీనియర్ నేత మురళీధర్‌రావు సూచించారు. పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో సరకులు పంపిణీ చేశామన్నారు.
ఇవీ చూడండి: నిత్యావసర సరుకులు అందజేసిన సభాపతి పోచారం