ఆంధ్రప్రదేశ్లోని రామతీర్థం ఘటన దురదృష్టకరమని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తిరుపతిలో పర్యటించిన ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
'అయోధ్యలో రామాలయం కడుతుంటే.. ఏపీలో కూల్చేస్తున్నారు' - రామతీర్థం ఘటన వివరాలు
ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై జరుగుతున్న దాడులు హిందువులను కలవరపాటుకు గురి చేస్తున్నాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంటే ఏపీలో దేవాలయాలను కూలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై జరుగుతున్న దాడులు హిందువులను కలవరపరుస్తున్నాయని లక్ష్మణ్ అన్నారు. ఒక పక్కన ప్రజల చిరకాల వాంఛ అయిన అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతుంటే ఏపీలో మాత్రం దేవాలయాల కూల్చివేత ఘటనలు జరుగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వెంటనే నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీవారి ఆశీస్సులతో శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నారని సంతోషం వ్యక్తం చేశారు. కొవిడ్ కష్టకాలంలోనూ తితిదే భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు.
ఇదీ చదవండి :నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుదుత్పత్తి కేంద్రంలో మంటలు