లాక్డౌన్ నేపథ్యంలో పలువురు పేదలకు, కార్మికులకు ముషీరాబాద్ నియోజకవర్గం భాజపా నేత రాంరెడ్డి కోడిగుడ్లను పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు. హైదరాబాద్ రాంనగర్ డివిజన్ బాకారం బస్తీలో దాదాపు వంద పేద కుటుంబాలకు భాజపా నేత బొల్లంపల్లి రాంరెడ్డి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ సౌమ్యనాయక్ గుడ్లు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆయా వస్తువులను తీసుకున్నారు.
పేదలకు కోడిగుడ్లు పంపిణీ చేసిన భాజపా నేత - groceries distribution
హైదరాబాద్ రాంనగర్ డివిజన్ బాకారం బస్తీలో వంద పేద కుటుంబాలకు భాజపా నేత రాంరెడ్డి కోడిగుడ్లను పంపిణీ చేశారు.
పేదలకు కోడిగుడ్లు పంపిణీ చేసిన భాజపా నేత
పార్టీ అగ్ర నాయకుల పిలుపు మేరకు గత 30 రోజులుగా ప్రజలకు అన్నదానం, నిత్యావసర సరకులు, కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నట్లు భాజపా నేత రాంరెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: నాయిబ్రాహ్మణులకు ఫేస్ షీల్డులను పంపిణీ చేసిన మంత్రి