తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫిట్​మెంట్ పేరుతో కొత్త డ్రామా: డీకే అరుణ - డీకే అరుణ వార్తలు

ఉద్యోగులకు ఫిట్​మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపాడని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్ర వేతన సవరణ కమిషన్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతటి దారుణమైన ఫిట్‌మెంట్ ఇవ్వలేదని తెలిపారు.

bjp leader dk aruna speak about prc
ఫిట్​మెంట్ పేరుతో కొత్త డ్రామా: డీకే అరుణ

By

Published : Jan 28, 2021, 1:28 AM IST

ఫిట్​మెంట్ 7.5 శాతం ఇచ్చి హెచ్ఆర్ఏ 6 శాతం తగ్గించటం దారుణమని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. సమైక్య పాలకులు 25 శాతం కంటే తక్కువ ఫిట్​మెంట్ ఎప్పుడూ ఇవ్వలేదని గుర్తు చేశారు. పీఆర్​సీ వేసిన వెంటనే ఐఆర్ ఇవ్వడం సంప్రదాయం... కానీ ఈ ప్రభుత్వం ఐఆర్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇంటి కిరాయిలు విపరీతంగా పెరుగుతుంటే హెచ్ఆర్ఏ తగ్గించాలని అనుకోవడం మూర్ఖత్వమేనన్నారు.

ఉద్యోగులపై కక్ష తీర్చుకోవడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనబడుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 63 శాతం ఫిట్​మెంట్ ఆశిస్తుండగా 7.5 శాతం సిఫారసు చేయడం ఘోర అవమానం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పోరాడి సాధించుకున్న తెలంగాణాలో వారిని ఇలా అవమానించడం సిగ్గుచేటన్నారు. ఇంత దిక్కుమాలిన సిఫారసులు చేసే బదులు వాటిని ప్రకటించకుండా ఉన్నా.. ఉద్యోగులకు గౌరవంగా ఉండేదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:ఫిట్‌మెంట్‌ 43 శాతం కంటే తగ్గకుండా ఇవ్వాలి : ఉద్యోగ సంఘాలు

ABOUT THE AUTHOR

...view details