తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస నేతలు దొంగ ఓట్లు వేయించారు: లక్ష్మణ్​ - పుర ఎన్నికలు

మున్సిపల్​ ఎన్నికల్లో పోటీ తెరాసకు, భాజపాల మధ్యే జరిగిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ పేర్కొన్నారు. తెరాస నేతలు దొంగ ఓట్లు వేయించారని విమర్శించారు.

bjp-laxman-spoke-on-muncipal-elections
గులాబీ నేతలు దొంగ ఓట్లు వేయించారు: లక్ష్మణ్​

By

Published : Jan 22, 2020, 7:59 PM IST

మున్సిపల్‌ ఎన్నికల్లో తమకు పోటీనే కాదన్న కేటీఆర్‌ భాజపానే లక్ష్యంగా పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని విమర్శించారు. ప్రగతి ఎజెండాకే ప్రజలు పట్టం కడుతారన్న కేటీఆర్‌... అక్రమాలు, అన్యాయాల్లో ప్రగతి సాధించారని ఎద్దేవా చేశారు. స్థానికంగా సెలవులు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగస్తులు ఓటు వినియోగించుకోలేక పోయారని చెప్పారు.

డబీర్‌పురాలో ఓటు వేయడానికి ముస్లింలు ముందుకు రాలేదంటే ఎంఐఎంపై ఎంత విరక్తితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో సీట్లు, ఓట్ల సంఖ్య పెంచుకుంటామని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు.

గులాబీ నేతలు దొంగ ఓట్లు వేయించారు: లక్ష్మణ్​

ఇవీ చూడండి: 'పుర' పోలింగ్ ముగిసింది.. ఫలితమే మిగిలింది

ABOUT THE AUTHOR

...view details