సికింద్రాబాద్లోని పార్సిగుట్ట వద్ద భాజపా నాయకుడు సారంగపాణి ఆధ్వర్యంలో భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదని... మోదీ పిలుపు మేరకు భాజపా అభ్యర్థులు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. పేద, వలస కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడించారు. మోదీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ అన్ని రంగాల వారికి ఊతమిచ్చేలా ఉందని పేర్కోనారు. కరోనాను అరికట్టడంలో తప్పకుండా మోదీ ప్రభుత్వం సఫలీకృతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన భాజపా సీనియర్ నేత లక్ష్మణ్ - భాజపా సీనియర్ నేత లక్ష్మణ్ వార్తలు
లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ అన్ని రంగాల వారికి ఊతమిచ్చేలా ఉందని భాజపా సీనియర్ నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. కరోనాను అరికట్టడంలో మోదీ ప్రభుత్వం తప్పకుండా సఫలమవుతుందని వ్యాఖ్యానించారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన భాజపా సీనియర్ నేత లక్ష్మణ్