అంబర్‌పేట ఘటనలో భాజపా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలపై పోలీసులు అనుసరించిన తీరుపై డీజీపీకి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. తొమ్మిది లక్షలకుపైగా ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై పార్టీలకతీతంగా శాంతియుతంగా ఉద్యమిస్తున్న తరుణంలో అంబర్‌పేటలో లేని అంశాన్ని తెరపైకి తెచ్చారని లక్ష్మణ్ ఆరోపించారు.
అన్యాయాన్ని ప్రశ్నిస్తే... నిర్బంధిస్తారా: భాజపా
అంబర్‌పేట ఘటనలో పోలీసులు అనుసరించిన తీరుపై డీజీపీకి భాజపా ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ స్థలాన్ని కాపాడటానికి వచ్చిన ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై నేతలు మండిప్డడారు.
రూ.350 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న అంబర్‌పేట-రామంతపూర్ ప్లై ఓవర్ పనులకు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. స్థలదారుడికి జీహెచ్‌ఎంసీ రూ.2.20 కోట్లు మొత్తాన్ని పరిహారం చెల్లించినా... అక్కడ ప్రార్థనలు చేసి వక్ఫ్ బోర్డుదని నోటీసు బోర్డు పెట్టడం వల్లనే స్థానికులు తిరగబడ్డారని తెలిపారు. అక్కడ జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించిన ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకుని అసభ్యకరంగా మాట్లాడారని ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి: అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న కేసీఆర్