BJP Criticises TS Government Action on Heavy Rains :రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ విమర్శించింది. రాష్ట్రంలో వరద ప్రభావం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 33 మంది మృతి చెందారని పేర్కొంది. వారికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
BJP instructions to TS Government on Rain: రాష్ట్రంలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకుండా.. రాజకీయాల్లో మునిగిపోయారని ఆరోపించారు. కనీసం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయలేదని ఆరోపించింది. వరద ఉధృతంగా ప్రవహించడంలో వల్ల కొన్ని ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని.. ముఖ్యంగా కడెం ప్రాజెక్ట్ భారీ స్థాయిలో సమస్యకు గురైందని.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. వరదల వల్ల పట్టణ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లిందని తెలిపింది. వరద ప్రహహం వల్ల కొంత మంది రోడ్డు పడ్డారని.. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొంది. కొన్ని పట్టణాల్లో ఇప్పటికే డ్రైనేజ్ వాటర్ చేరినందున అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే.. సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది.
Bandi Sanjay Comments on CM KCR : రాష్ట్రంలో ప్రభుత్వం వరదలపై ప్రజలను ముందుగా అప్రమత్తం చేసే ఎలాంటి చర్యలు చేయలేదని బీజేపీ నాయకుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వర్ష ప్రభావంపైన ముందుగానే మేల్కొంటే ఇంత ప్రమాదం.. ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది కాదని విచారం వ్యక్తం చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు కాపాడేందుకు అధికారులు కష్టపడుతున్న ప్రభుత్వం సహకరించలేదని ధ్వజమెత్తారు.