'సీఏఏ మద్దతు సభకు భారీగా జన సమీకరణ చేయాలి ' - భాజపా
సీఏఏకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వచ్చే నెల 15న హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. బహిరంగ సభకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానుండడం వల్ల పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని ఆదేశించారు.
BJP CAA support meeting march 15th at Hyderabad latest news