రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని భాజపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ అన్నారు. ఆ పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా శనివారం హైదరాబాద్ లాలాపేటలోని శాంతినగర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రామచందర్ రావుతో కలిసి హాజరయ్యారు. తెరాస ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భాజపా అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపా మరింత బలోపేతం అయ్యేందుకు నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు భారీగా పెంచాలని బాబు మోహన్ సూచించారు.
'రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో విఫలం' - బాబు మోహన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని భాజపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ అన్నారు. భాజపా సభ్యత్వ నమోదులో భాగంగా లాలాపేటలోని శాంతినగర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.
'రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో విఫలం'