జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా ఆసిఫ్‌నగర్ అభ్యర్థి లావణ్య ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
'భాజపా గెలుపే సమస్యలకు పరిష్కారం' - గ్రేటర్ ఎన్నికలు
ప్రజాసమస్యలు పరిష్కారం కావాలంటే గ్రేటర్ ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని ఆసిఫ్‌నగర్ అభ్యర్థి లావణ్య అన్నారు. ఎన్నికల్లో హామీలిచ్చి మరిచిపోవడమే ఎంఐఎం కార్పొరేటర్లకు తెలుసని ఆమె విమర్శించారు.
'భాజపా గెలుపే సమస్యలకు పరిష్కారం'
గతంలో ఎంఐఎం కార్పొరేటర్ హామీలను గాలికొదిలేశారని ఆమె అన్నారు. వరదసాయం ప్రజలకు సక్రమంగా అందజేయలేదని తెలిపారు. భాజపాను గెలిపిస్తే డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటును వేసేముందు ప్రజలు ఆలోచించాలని లావణ్య విజ్ఞప్తి చేశారు.