తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కారు తీరును నిరసిస్తూ 14న కలెక్టరేట్ల ఎదుట ధర్నా

పీఆర్‌సీని సత్వరమే ప్రకటించాలనే ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఈ నెల 14న ధర్నా చేపట్టనున్నట్లు భాజపా అనుబంధ రిటైర్డ్‌ ఉపాధ్యాయ సెల్‌ నేతలు ప్రకటించారు. పింఛనుదారుల పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

bjp affiliated retired teachers cell leaders will conduct dharna on 14th december
పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలంటూ 14న కలెక్టరేట్ల ఎదుట ధర్నా

By

Published : Dec 10, 2020, 5:04 PM IST

Updated : Dec 10, 2020, 5:11 PM IST

పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలనే ప్రధాన డిమాండ్‌తో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఈ నెల 14న ధర్నా చేపట్టనున్నట్లు భాజపా అనుబంధ రిటైర్డ్‌ ఉద్యోగ ఉపాధ్యాయ సెల్ నేతలు ప్రకటించారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్‌, పార్టీ రిటైర్డు ఉద్యోగ ఉపాధ్యాయ సెల్ నేత బి. మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

పింఛనుదారుల పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదని.. వెంటనే పీఆర్‌సీని ప్రకటించాలని స్వామిగౌడ్ డిమాండ్ చేశారు. కొవిడ్ నిబంధనలతో ప్రభుత్వ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు పునఃప్రారంభించాలన్నారు. అంతర్‌ జిల్లా, భార్యాభర్తల బదిలీలు, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంలేదని మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:గవర్నర్​ను కలిసిన టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​.. వార్షిక నివేదిక అందజేత

Last Updated : Dec 10, 2020, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details