Bio Asia Conference 2023 Starts from today Hyderabad: భాగ్యనగరం మరో ప్రపంచ స్థాయి సదస్సుకు వేదిక అయ్యేందుకు సిద్ధమైంది. లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన అభ్యాసాలు, సవాళ్లు, అవకాశాలపై చర్చిస్తూ.. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో బయో ఆసియా 20వ ఎడిషన్ సదస్సు నేడు ప్రారంభం కానుంది. సదస్సులో ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిర్వాహక ప్రతినిధులు, పలు పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, పలు విద్యాసంస్థల అధినేతలు పాల్గొననున్నారు.
Bio Asia Conference 2023 in Hyderabad : 2022లో కొవిడ్ కారణంగా వర్చువల్ విధానంలో నిర్వహించిన బయో ఆసియా సదస్సును.. తిరిగి పూర్వ వైభవంతో ఆఫ్‌లైన్ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఘనంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండోరోజు కార్యక్రమంలో భాగంగా స్టార్ట్ అప్ షో కేసును ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుందని ఆయన వివరించారు. జీవశాస్త్రం రంగంలో అనేక పరిశోధనలు చేయడానికి ఎంతో ఆస్కారం ఉందని పేర్కొన్నారు.