మహబూబాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. గార్ల నుంచి మహబూబాబాద్ వస్తున్న ఆటో అదుపుతప్పి... అనంతారం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో తలకిందులుగా పడిపోయింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిలో మహేందర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఆటోను ఢీకొన్న ద్విచక్రవాహనం... ఓ వ్యక్తి మృతి - bike
మహబూబాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. బైక్‌పైన ఉన్న ఓ యువకుడు అక్కడికక్కడే మరణించగా... మరో వ్యక్తితో పాటు ఆటోలో ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆటోను ఢీకొన్న బైక్... ఓ వ్యక్తి మృతి