తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎస్​ను కలిసిన బిహార్​ ఆర్థిక సేవల అధికారులు

సీఎస్​ సోమేశ్​కుమార్​ను బిహార్​ ఆర్థిక సేవల అధికారులు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జీఎస్టీ అమలు తీరును సీఎస్​ వారికి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గనిర్దేశంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు.

Bihar Financial Services officials met CS somesh kumkar
సీఎస్​ను కలిసిన బిహార్​ ఆర్థిక సేవల అధికారులు

By

Published : Mar 16, 2021, 9:59 PM IST

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్​ను బిహార్ ఆర్థిక సేవల అధికారులు కలిశారు. బీఆర్కే భవన్​లో సీఎస్​తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జీఎస్టీ అమలు తీరును బిహార్‌ అధికారులకు సోమేశ్​ కుమార్​ వివరించారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో 2018, 2020లో రెండుసార్లు హేతుబద్ధీకరణ, పునర్​వ్యవస్థీకరణ చేసినట్లు వారికి తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గనిర్దేశంలో ట్యాక్స్‌ బేశ్​లో గణనీయమైన పురోగతి సాధించినట్లు సీఎస్​ తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వాణిజ్య పన్నుల రాబడిని రెట్టింపు చేయడం సాధ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన రంగాల్లో విశ్లేషణ, పరిశోధన, రెవెన్యూ పొటెన్షియల్ ఉన్న ఏరియాలను గుర్తించేందుకు వాణిజ్య పన్నుల శాఖలో ఎకనామిక్స్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. సాంకేతిక నైపుణ్యాన్ని వాడుకోవడం ద్వారా రెవెన్యూ రియలైజేషన్ లక్ష్యాలను సాధించినట్లు ఆయన వివరించారు.

ఇదీ చూడండి: 134 కి.మీ. రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details