బోరబండకు చెందిన దంపతులు వారి కుమార్తెతో కలిసి భూత వైద్యుడు ఆజాంను కలిశారు. ఇంట్లో దెయ్యం ఉందని... దాన్ని వదిలిస్తానని చెప్పి అతను వారిని భయపెట్టాడు. బీదర్‌లోని దర్గాకు తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని... లేని పక్షంలో మంచి జరగదంటూ సూచించాడు. ఈ నెల 11న వారి ఇంటికి వెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. బాధితులు ఎస్‌ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
బోరబండ భూతవైద్యుడు అరెస్ట్
భూత వైద్యం పేరుతో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
భూతవైద్యుడు అరెస్ట్