తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని శ్రీ కౌత కామకోటి కల్యాణ వేదికలో బ్రాహ్మణ ఐక్య మహాసభ ఏర్పాటు చేశారు. బ్రాహ్మణుల స్థితి గతులు, వారి సమస్యలను అధ్యయనం చెసే దిశగా పోరాడుతామని వారు తెలిపారు. ఈ ర్యాలీని గత నెల 22న యాదాద్రి నుంచి ప్రారంభించారు. 31 జిల్లాలు ప్రయాణించి ఆగస్టు 7న హైదరాబాద్ చేరుకుంది. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణచారి, వేణుగోపాలచారి, కెప్టన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వొడితెల సతీష్, ఎమ్మెల్సీ రాంచందర్రావు, పురాణం సతీష్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బ్రాహ్మణుల సమస్యల్ని పరిష్కరించాలి : బ్రాహ్మణ సంఘాలు
బ్రాహ్మణుల సమస్యలపై సికింద్రాబాద్లో బ్రాహ్మణ ఐక్య మహాసభ ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లతో ఈ నెల 18న సచివాలయానికి వెళ్లనున్నట్లు వారు తెలిపారు.
బ్రాహ్మణుల సమస్యల్ని పరిష్కరించాలి : బ్రాహ్మణ సంఘాలు