ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని బోలక్పూర్ డివిజన్ తెరాస అభ్యర్థి నవీన్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: భోలక్పూర్ తెరాస అభ్యర్థి - జీహెచ్ఎంసీ ఎన్నికల తాజా అప్డేట్స్
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తన గెలుపునకు ఉపయోగపడతాయని భోలక్పూర్ తెరాస అభ్యర్థి బింగి నవీన్ అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకే ఓటు వేయాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు.
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: బోలక్పూర్ తెరాస అభ్యర్థి
ఎంఐఎం కార్పొరేటర్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు. అలాకాకుండా తాను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తన గెలుపునకు దోహదపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:టౌన్‌షిప్ పాలసీతో భాగ్యనగరంపై తగ్గనున్న భారం: కేటీఆర్