సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని కాంగ్రెస్ ఎప్పటి నుంచో అంటోందని ఆ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమాక్ర అన్నారు సబ్‌ప్లాన్ నిధులపై అఖిల పక్షం ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. ప్రభుత్వం ప్రచారం కోసం భారీగా ఖర్చు చేస్తోందని ఆరోపించారు. రోజురోజుకు పెరుగుతున్న అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందన్నారు. ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని... గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని... నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. కూకట్‌పల్లిలో పట్టాభూములు ఉన్న వారిని కొందరు స్థానిక నేతలు బెదిరించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సబ్‌ప్లాన్ నిధులపై అఖిలపక్షం ఏర్పాటు స్వాగతిస్తున్నాం: భట్టి - congress mla
సబ్‌ప్లాన్ నిధులపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తామన్న సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కోసం భారీగా వ్యయం చేస్తోందని ఆరోపించారు.
సబ్‌ప్లాన్ నిధులపై అఖిలపక్షం ఏర్పాటు స్వాగతిస్తున్నాం: భట్టి