తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీ పనిదినాలు కుదించడం సరికాదు

అసెంబ్లీ పనిదినాలు కుదించడం సరికాదన్నారు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క. అసెంబ్లీని 21 రోజులు నడపాలని సీఎంను కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

By

Published : Sep 9, 2019, 4:23 PM IST

Updated : Sep 9, 2019, 7:30 PM IST

అసెంబ్లీ


శాసనసభ బడ్జెట్ సమావేశాల పనిదినాలు కుదించడం సరికాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీని 21 రోజులు నడపాలని కోరారు. శాసనసభ ఆవరణలో భట్టి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తన అభ్యంతరాలపై... సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ రూల్స్ బుక్​కు అనుగుణంగానే నడుచుకుంటానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈసారికి వదిలేయాలని వచ్చేసారి నుంచి 21 రోజులపాటు సమావేశాలు పెట్టుకుందామని సీఎం చెప్పారని తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. దక్షిణాఫ్రికా పర్యటన ఉన్న కారణంగా ఇప్పుడు పనిదినాలు పెంచడం కుదరదని ముఖ్యమంత్రి తెలిపినట్లు భట్టి వివరించారు. పార్లమెంట్ తరహాలో కానిస్టిట్యూషనల్‌ క్లబ్ ఏర్పాటు చేయాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందిచారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ప్రోటోకాల్ అంశాలను లేవనెత్తినట్లు చెప్పారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్ల మధ్య ప్రోటోకాల్​పై స్పష్టత కోసం కమిటీ వేయాలని స్పీకర్​ను కోరినట్లు సీఎం చెప్పారని భట్టి పేర్కొన్నారు.

అసెంబ్లీ పనిదినాలు కుదించడం సరికాదు
Last Updated : Sep 9, 2019, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details