ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆయన అహంకారానికి పరాకాష్ఠ అని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కార్మిక చట్టాల ద్వారా మాత్రమే కార్మికులు సమ్మెకు దిగారని... వారిని అణిచివేయడానికి సీఎం ప్రయత్నించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. సమ్మెకు దిగిన కార్మికులతో చర్చలు జరపకుండానే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించడం దారుణమన్నారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదని భట్టి పేర్కొన్నారు.
సీఎం ప్రకటన.. అహంకారానికి పరాకాష్ఠ: భట్టి - rtc
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి పరాకాష్ఠ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క