తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ @7PM - Bharath top ten news for 7pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Bharath top ten news for 7pm
టాప్​ 10 న్యూస్ @7PM

By

Published : Jun 4, 2020, 6:57 PM IST

ముగిసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం

హైదరాబాద్‌ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్​ పరమేశం అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. భేటీలో ఏం చర్చకు వచ్చిదంటే..

తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం

అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్‌ అధికారిని నియమించారు. 1993 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి రవి కోటను నియమిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆయన ఏ జిల్లాకు చెందినవారంటే..

ఆచూకీ చెప్తే రెండు లక్షలు

కేరళలో ఏనుగుని చంపినవారి ఆచూకీ తెలిపితే రెండు లక్షలు ఇస్తానని మేడ్చల్ జిల్లా నెరడ్​మెట్​కు చెందిన విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ ఘటన మానవత్వానికే మచ్చగా మిగిలిపోతుందన్నారు. ఇంకేమన్నారంటే..

వాళ్లపై పదేళ్ల పాటు నిషేధం

తబ్లిగీ జమాతే కార్యకలాపాల్లో పాలు పంచుకున్న 2550 మంది విదేశీయులపై భారత్​లోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. నిషేధం ఎందుకు విదించారంటే..

మీకు నల్ల వెల్లుల్లి తెలుసా?

మీరు నల్ల వెల్లుల్లి తింటున్నారా... అదేంటి వెల్లుల్లి తెల్లగా ఉంటుంది కదా అనుకుంటున్నారా..? ఈ నల్ల వెల్లుల్లి ప్రత్యేకంగా దొరకదు. దీనిని ఓ పద్ధతిలో నిల్వచేయడం ద్వారా తయారు చేస్తారు. ఇది తింటే ఒంటికి చాలా మంచిదట. మీరు ఓసారి ట్రై చేయండి.

కాపురాలపై కరోనా దెబ్బ

పెళ్లి అయిందంటే చాలు.. ఏడాది తిరగకుండానే మనవడినో, మనవరాలినో ఇవ్వాలంటూ నానమ్మలు, అమ్మమ్మలు తెగ తొందరపెట్టేస్తారు. కానీ, మహారాష్ట్రలోని ఓ గ్రామంలో మాత్రం రెండేళ్ల వరకు పిల్లల జోలికి పోవద్దంటున్నారు. ఎందుకంటే..

ఏనుగు మృతికి వారే కారణం!

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన కేరళ ఏనుగు మృతి ఉదాంతంలో ముగ్గురు అనుమానితులపై దృష్టి సారించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ వెల్లడించారు. ఇంకేమన్నారంటే..

జాతి వివక్షపై పోరాటానికి గూగుల్​ సహాయం

ఆఫ్రో-అమెరికన్​ జార్జ్​ ఫ్లాయిడ్​ మృతి నేపథ్యంలో జాతి వివక్షపై పోరాటం చేస్తున్న వారికి బాసటగా నిలిచింది గూగుల్​. ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఎన్ని మిలియన్​ డాలర్లు ప్రకటించిదంటే...

విదేశాల్లో ఐపీఎల్​?

ఐపీఎల్​ నిర్వహణకు అన్నిరకాల సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తోంది బీసీసీఐ. సెప్టెంబరు-అక్టోబరులో జరపడం సహా భారత్​లో వీలుకాకపోతే విదేశాల్లోనైనా టోర్నీ నిర్వహించాలని భావిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఛాన్స్​ వచ్చినా వద్దనుకున్నారు

బాలీవుడ్​లో అవకాశాలు వచ్చినా ఆ స్టార్స్ వద్దనుకున్నారు. దక్షిణాదిలోనే సినిమాలు చేస్తామని, ఇప్పట్లో హిందీలోకి వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. ఇంతకీ వారు ఎవరు? ఎందుకు వద్దనుకున్నారు? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details