కరోనా వ్యాధికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు టీకా (బీబీవీ154) క్లినికల్ పరీక్షల్లో మంచి ఫలితాలు కనబరుస్తున్నట్లు, వచ్చే కొద్ది రోజుల్లోనే దీనిపై 2, 3 దశలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌కు ఇప్పటివరకూ మనదేశంలో అభివృద్ధి చేసిన ఏకైక చుక్కల మందు టీకా (నాసల్ వ్యాక్సిన్) ఇదే కావటం గమనార్హం. మొదటి దశ ప్రయోగాల్లో ఈ టీకా బాగా పనిచేస్తోందని నిర్ధారణ అయినట్లు సమాచారం. ఎంతో భద్రతను ప్రదర్శించటంతో పాటు, మనిషి శరీరంలోకి కరోనా వైరస్ చేరకుండా సమర్థంగా నివారించగలదని తేలింది. మొదటి దశ ప్రయోగ పరీక్షలకు సంబంధించిన సమాచారం త్వరలో వెల్లడికానుంది.
bharat biotech : కొవిడ్ కట్టడికి దేశంలో ఏకైక చుక్కల మందు - హైదరాబాద్ వార్తలు
కొవిడ్ వైరస్‌కు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు టీకా (బీబీవీ154) క్లినికల్ పరీక్షల్లో మంచి ఫలితాలు కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి దశ ప్రయోగాల్లో ఈ టీకా బాగా పనిచేస్తోందని నిర్ధారణ అయినట్లు సమాచారం.
ఇంజక్షన్ ద్వారా ఇచ్చే టీకాల కంటే ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు టీకా బాగా పనిచేస్తుందనే అభిప్రాయం శాస్త్రవేత్తల్లో ఉంది. కరోనా వైరస్ ముక్కు నుంచే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి గొంతు, ఆపై ఊపిరితిత్తుల్లోకి విస్తరిస్తుంది. అందువల్ల ఈ వైరస్ ముక్కులో చొరబడే సమయంలోనే నివారించటానికి కొత్త టీకా దోహదపడుతుందని భావిస్తున్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు టీకా వివరాలను త్వరలో వెల్లడిస్తామని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కే.పాల్ తెలిపారు.
ఇదీ చూడండి:NEET EXAM: నేడే నీట్ 2021 పరీక్ష.. ఫాలో కావాల్సిన రూల్స్ ఇవే!