తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులకు న్యాయం చేయాలి :ఆర్​.కృష్ణయ్య - బీసీ విద్యార్థి సంఘం

మెడికల్​ కౌన్సెలింగ్​కు సంబంధించి హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్​. కృష్ణయ్య డిమాండ్​ చేశారు. నాయకత్వ లక్షణాల్నిఅలవరుచుకుని పోరాడాలని సూచించారు.

విద్యార్థులకు న్యాయం చేయాలి :ఆర్​.కృష్ణయ్య

By

Published : Aug 22, 2019, 5:36 PM IST

హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించారు. మెడికల్ కౌన్సెలింగ్​కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్​ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మెడికల్ కౌన్సెలింగ్ లో నిర్లక్ష్యం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 262 మంది విద్యార్థులు సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్​పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలన్నారు. జరిగిన అన్యాయంపై రాష్ట్రపతిని కలిసి విన్నవించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేస్తున్నదని... ఈ వైఖరి విడనాడకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాల్ని అలవరుచుకొని పోరాడాలన్నారు.

విద్యార్థులకు న్యాయం చేయాలి :ఆర్​.కృష్ణయ్య

ABOUT THE AUTHOR

...view details