రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన అన్ని విద్యాసంస్థలపై సీబీఐ విచారణ జరిపించాలని... అఖిలపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో 'గాడితప్పిన విద్యావ్యవస్థ- ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ ఇందుకు వేదికైంది.
రిజర్వేషన్లు పాటించకుండా నియంతగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అప్పారావు అరెస్ట్ చేయాలని కోరారు. తరగతులు చెప్పకున్న, వసతి గృహాలు నిర్వహించకున్నా.. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ కౌన్సెలింగ్‌లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు చేయాలని.. జాతీయ స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని కోరారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 13 విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పోస్టులను సామాజిక న్యాయం పాటిస్తూ భర్తీ చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు.
ఇవీచూడండి:గెట్అవుట్ 2020... హమ్మయ్య ఇవాళ్టితో వెళ్లిపోతోంది!