తెలంగాణ

telangana

ETV Bharat / state

R.KRISHNAIAH: 'ఈ నెల 8న బీసీ సమర శంఖారావం' - telangana news 2021

రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న బీసీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా బీసీ సమర శంఖారావానికి పిలుపునిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య పేర్కొన్నారు. అన్ని కలెక్టరేట్ కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీస్​ల ఎదుట పెద్దఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ బంధు ప్రకటించాలన్న ఆయన.. బీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

R.KRISHNAIAH: 'ఈ నెల 8న బీసీ సమర శంఖారావం'
R.KRISHNAIAH: 'ఈ నెల 8న బీసీ సమర శంఖారావం'

By

Published : Sep 2, 2021, 6:45 PM IST

'బీసీ బంధు' ప్రకటించి ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్​లోని బీసీ భవన్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న బీసీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా బీసీ సమర శంఖారావానికి పిలుపునిస్తున్నట్లు ఆర్​.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ సమస్యల సాధనకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీస్​ల ఎదుట పెద్దఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. బీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితబంధును స్వాగతిస్తున్నామన్న ఆయన.. అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీలకూ తక్షణమే బీసీ బంధు ప్రకటించాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

చదువుకు దూరం చేసే కుట్ర..

పేద విద్యార్థులకు చదువును దూరం చేసే కుట్రలో భాగంగానే రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను ప్రారంభించలేదని కృష్ణయ్య దుయ్యబట్టారు. ఇందుకు కోర్టు తీర్పును సాకుగా చూపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ప్లీడర్లు సరైన వివరణను కోర్టుకు అందించి.. రివ్యూ పిటిషన్ ద్వారా గురుకులాలు, హాస్టళ్లను ప్రారంభించేందుకు అనుమతి పొందాలని కోరారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పేద ప్రజలు చదువుకోకుండా.. వారికి స్కాలర్​షిప్పులు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్పర్యం చేస్తుందన్న ఆయన.. స్కాలర్​షిప్​ బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు.

వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు..

రాష్ట్రంలో రాజకీయ నాయకులు సెటిల్​మెంట్లలో మునిగితేలుతూ.. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కృష్ణయ్య విమర్శించారు. ఉన్నతాధికారులూ భూ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిజాయితీ గల, ఉన్నతమైన అధికారులను పక్కనపెట్టి.. ప్రభుత్వం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందని ఆక్షేపించారు.

ఈ నెల 8న బీసీ సమర శంఖారావానికి పిలుపునిస్తున్నాం. బీసీ వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ఎమ్మార్వో ఆఫీసుల ఎదుట పెద్దఎత్తున ధర్నాలు చేపడతాం. బీసీ సమస్యల సాధనకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. దళితబంధును స్వాగతిస్తున్నాం. అలాగే బీసీ బంధు కూడా ప్రకటించాలి. బీసీల్లోనూ చాలా మంది వెనుకబడిన వారున్నారు. వారందరికీ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలి. - ఆర్​.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

ఇవీ చూడండి..

'చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం హరియాణా అసెంబ్లీలో తీర్మానం చేయించండి'

బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి: ఆర్​.కృష్ణయ్య

ABOUT THE AUTHOR

...view details