తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధికి పాటుపడిన తెరాసకే మా మద్దతు: బీసీ కమిషన్ - జీహెచ్‌ఎంసీ పోల్స్ 2020

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ మద్దతు తెరాసకేనని బీసీ కమిషన్ తీర్మానించింది. వెనుకబడిన కులాల కోసం ప్రభుత్వం చేసిన మేలును మరువబోమని కమిషన్ సభ్యులు అన్నారు. లక్డీకపూల్‌లో వెనుకబడిన కులాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

bc commission support to trs in ghmc elections
అభివృద్ధికి పాటుపడిన తెరాసకే మా మద్దతు: బీసీ కమిషన్

By

Published : Nov 27, 2020, 5:08 PM IST

గ్రేటర్ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు తెరాసకేనని మాజీ బీసీ కమిషన్ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్ ప్రకటించారు. నీతి నిజాయితీలకు కట్టుబడి ఉండే వెనుకబడిన కులాలకు ప్రభుత్వం చేసిన మేలు మరువబోమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లక్డీకపూల్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో వెనుకబడిన కులాల ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. భవిష్యత్ కార్యచరణ దశ-దిశపై చర్చించారు.

17 కొత్త కులాల చేరికతో తమ బలం 130 కులాలకు పెరిగిందని... రాష్ట్ర ప్రభుత్వం ఏటా వెనుకబడిన తరగతులకు ఇచ్చే నిధుల వాటా పెంచుకుంటూ వస్తోందని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తెరాసకే తమ మద్దతు అని నేతలు తీర్మానించారు.

ఇదీ చదవండి:కాంగ్రెస్ ఆరోగ్యశ్రీ, ఫీజు మాఫీ తెచ్చింది : జ్యోతి గౌడ్

ABOUT THE AUTHOR

...view details