తెలంగాణ

telangana

ETV Bharat / state

సద్దుల బతుకమ్మ ఉయ్యాలో... ఊరూర సంబురమే ఉయ్యాలో!!! - BATUKAMMA LAST DAY CELEBRATIONS

తెలంగాణ పూలపండుగ ఉయ్యాలో... ఆఖరి రోజుకు చేరుకుంది ఉయ్యాలో... సద్దుల పండుగ ఉయ్యాలో... అంబరాన్నంటేనే సంబురాలు ఉయ్యాలో... గునుగూ తంగేడు వనాలు ఉయ్యాలో... లోగిల్లలో గౌరమ్మలు ఉయ్యాలో... పట్టుచీరల్లో పడుతులు ఉయ్యాలో... ఆటపాటలతో పరవశించునే ఉయ్యాలో...!!!

BATUKAMMA CELEBRATIONS IN GRAND WAY ON LAST DAY IN TELANGANA STATEWIDE

By

Published : Oct 6, 2019, 6:08 AM IST

Updated : Oct 6, 2019, 7:22 AM IST

సద్దుల పండుగ ఉయ్యాలో... ఊరూర సంబురమే ఉయ్యాలో!!!

సద్దుల బతుకమ్మ సంబురానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధమైంది. పట్టణాలు, పల్లెల్లో వాడవాడ కోలాహలంగా మారనుంది. తీరొక్క పూలతో సద్దుల బతుకమ్మలు కొలువుదీరనున్నాయి. ఉయ్యాల పాటలతో, పడుతుల ఆటలతో వాడవాడ హోరెత్తనుంది.

ఊరూరా.. భారీ ఏర్పాట్లు

తొమ్మిది రోజుల పండుగలో చివరి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ నిమజ్జనాల కోసం ఆయా చెరువుల వద్ద విద్యుత్​కాంతులతో ముస్తాబుచేశారు. ప్రజల సౌకర్యార్థం పలు చోట్ల ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా... పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​ సహా... అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఇవీ చూడండి: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్​

Last Updated : Oct 6, 2019, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details