తెలంగాణ సంప్రదాయాన్ని సింగపూర్‌లోనూ కొనసాగించడంలో ఎల్లప్పుడు ముందుండే తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో అక్టోబర్ 24న సింగపూర్ బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో ఈఏడు వేడుకల్లో ప్రత్యక్షంగా ఐదుగురు పాల్గొనగా జూమ్ ద్వారా మిగిలిన వారు హాజరై సంబురాలను కన్నుల పండువగా నిర్వహించారు. ఏటా సుమారు రెండు నుంచి మూడు వేల మంది పాల్గొనేవారని.. ఈసారి కొవిడ్ నిబంధనల కారణంగా దాదాపు 50 చోట్ల ఐదుగురు సమూహంతో ఆన్లైన్ ద్వారా నిర్వహించామని టీసీఎస్ఎస్ కార్యవర్గం తెలిపింది. అనివార్య కారణాల వల్ల ఆన్లైన్ సంబురాల్లో పాల్గొనలేకపోయిన శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపి టీసీఎస్‌ఎస్‌ను అభినందించారు. సొసైటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ బంజారా జానపద కళాకారిణి అశ్విని రాథోడ్ ధూంధాం పాటలతో అలరించి ఆడపడుచులను ఉత్సాహపరిచారు.
సంప్రదాయానికి విదేశంలో పట్టంకట్టిన వారికి కృతజ్ఞతలు...