సీజన్ జ్వరాల నివారణ కోసం హైదరాబాద్ నగరంలోని బస్తీ దవాఖానల్లో 24 గంటలపాటు వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అలాగే ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రుల్లో 12 గంటలపాటు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. రామంతపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిని మంత్రులు ఈటల, మల్లారెడ్డి, నగర మేయర్ రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పరిశీలించారు. డెంగ్యూ నివారణ కోసం హోమియోపతి మందులను మంత్రులు పంపిణీ చేశారు. జ్వరాల నివారణకు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురుగు కాలువలు, రోడ్లు సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల రోగాల బారిన పడుతున్నామని ఆసుపత్రికి వచ్చిన పలువురు రోగులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన నగర మేయర్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: మంత్రి ఈటల
రాష్ట్రంలో సీజన్ జ్వరాల నివారణకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. డెంగ్యూ నివారణ కోసం రామంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హోమియోపతి మందులను మంత్రి మల్లారెడ్డితో కలిసి ఈటల పంపిణీ చేశారు.
Ministers