సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేసిన మహాత్మ బసవేశ్వరుడి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని బసవేశ్వర సేవ సమితి పిలుపునిచ్చింది. శ్రావణ మాసంలో ప్రజలకు బసవేశ్వరుని చరిత్రను తెలియజేసేందుకు సమితి నాయకులు భక్తి ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ బేగంబజార్లో నిర్వహించిన భజన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ప్రవచనాలు పారాయణం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ఆశ్రమానికి చెందిన గురువు శ్రీ అక్క నాగబలంబిక హాజరై బసవేశ్వరుడి భజన, కీర్తనలు ఆలపించారు. ప్రపంచ శాంతి కోసం పురాణాల నుంచి భక్త ప్రవచనాలు, కీర్తనలు, భజనలు చేసేవారమని మత గురువు తెలిపారు. విశ్వ గురువు బసవేశ్వరుడి చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శం అని.. ధర్మాన్ని కాపాడుకుంటూ, సన్మార్గంలో ప్రయాణించాలని భక్తులకు సూచించారు.
బేగంబజార్లో బసవ ప్రవచనాలు
బసవేశ్వరుని చరిత్రను తెలియజేసేందుకు బసవేశ్వర సేవ సమితి నాయకులు భక్తి ప్రవచన కార్యక్రమాన్ని హైదరాబాద్లోని బేగంబజార్లో నిర్వహించారు. శాంతి యుత సమాజ నిర్మాణానికి మహాత్మ బసవేశ్వరుడు చేసిన కృషిని నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బేగంబజార్లో బసవ ప్రవచనాలు