ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన ఒక్క రోజు సమ్మెలో.. ఎస్బీఐ, ఐవోబీ మినహా అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఎస్బీఐ, ఐవోబీ మినహా.. మిగిలిన బ్యాంకులు మూతపడనున్నాయి.
నేడు కార్మిక సంఘాల సమ్మె... పాల్గొననున్న బ్యాంకు ఉద్యోగులు..
తమ సమస్యల పరిష్కారానికి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన ఒక్క రోజు సమ్మెలో ఎస్బీఐ, ఐవోబీ మినహా అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఈ రెండు బ్యాంకులు మినహా మిగతా బ్యాంకులు ఈ రోజు మూతపడనున్నాయి.
నేడు కార్మిక సంఘాల సమ్మె... పాల్గొనున్న బ్యాంకు ఉద్యోగులు..
ప్రైవేటీకరణ, అప్పుల ఎగవేతదారులపై చర్యలు, సహకార బ్యాంకుల్లో రాజకీయ జోక్యం అంశాలపై తమ డిమాండ్లు వినిపించనున్నట్లు ఉద్యోగుల సంఘం నాయకులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. ఇవాళ కోఠిలోని సెంట్రల్ బ్యాంకు ఆవరణలో సమావేశమై.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన తెలియజేయనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:గ్రేటర్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: కిషన్రెడ్డి
Last Updated : Nov 26, 2020, 6:12 AM IST