Bangladesh Robbery Gang Looted 8 Lkahs from Hyderabad : కూకట్పల్లిలో విదేశీ నగదు మార్పిడి ఓ సంస్థలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు వ్యక్తులు ఏజెన్సీలోకి ప్రవేశించి ఏజెన్సీ ప్రతినిధితో పరిచయం చేసుకున్నారు. తమ దగ్గర డాలర్లు ఉన్నాయని వాటి బదులు భారతీయ కరెన్సీ అవసరముందని చెప్పారు. నమ్మిన ఉద్యోగి వారి నుంచి డాలర్లు తీసుకొని మన కరెన్సీ ఇచ్చారు. ఇలా రెండు దఫాలు 500 డాలర్ల నగదు మార్పిడి చేసుకొంటూ ఉద్యోగితో పరిచయం పెంచుకున్నారు. నమ్మకం కుదిరిందని భావించిన నేరగాళ్లు మూడోసారి తమ పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
Foreign currency exchnage office:నేరుగా ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లకుండా తమ తల్లి అనారోగ్యానికి గురైందని, వెంటనే 8 లక్షలు డబ్బు అవసరముందంటూ ఏజెన్సీ ప్రతినిధికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. తాముండే ప్రాంతానికి వచ్చి డాలర్లు తీసుకుని నగదు ఇవ్వాలని కోరారు. నమ్మిన ఉద్యోగి రూ.8 లక్షల నగదును తమ కుమారుడికి ఇచ్చి పంపారు. నిందితులు మొత్తం సొమ్ము ఇవ్వకుండా నోట్ల కట్ట పైన, కింద 100 డాలర్ల నోట్లు ఉంచి మధ్యలో మాత్రం ఒక డాలర్ నోట్లు 38 ఉంచారు. ఉద్యోగి కుమారుడు ఇవేవీ గమనించలేదు. నిందితులు 8.లక్షలు తీసుకుని వెళ్లిపోయారు. ఉద్యోగి కుమారుడు డబ్బు తీసుకెళ్లి ఇంట్లో పెట్టాడు.
నోట్ల పరిమాణం ఒకేలా ఉండటంతో : మరుసటి రోజు అతని తండ్రి గమనించారు. పైన కింద మాత్రమే 100 డాలర్ల నోట్లు రెండు ఉన్నాయిని గుర్తించారు. మిగిలినవన్నీ ఒక్క డాలర్ నోట్లు మాత్రమే కావడంతో కంగుతిని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మన దేశ కరెన్సీలా కాకుండా అమెరికాలో నోట్ల పరిమాణం ఒకేలా ఉంటుంది. 100 డాలర్లయినా.. ఒక డాలర్ నోటైనా పరిమాణం ఒకే సైజులో ఉంటాయి. దీన్నే ఆ నిందితులు ఆసరాగా చేసుకుని డబ్బు కొట్టేశారని పోలీసులు అంచనాకు వచ్చారు.