తెలంగాణ

telangana

ETV Bharat / state

బంగ్లాదేశ్‌ మార్కెట్‌.... ఇక్కడ అన్ని చవకే! - bags

తక్కువ ధరకే అదిరిపోయే చీరలు కావాలా...? మరింత ఛీప్‌గా ఫర్నీచర్‌ కావాలా..? బంగ్లాదేశ్‌ మార్కెట్‌కు పోవాల్సిందే. ఎంత తక్కువ రేటుకు దొరికితే మాత్రం బంగ్లాదేశ్‌కు వెళ్లి షాపింగ్‌ చేయడం ఏంటి..! ఛార్జీ ఖర్చులు వాచిపోతాయి కదా అంటారా..! బంగ్లాదేశ్‌లోని మార్కెట్‌ గురించి కాదులెండి. హైదరాబాద్‌లోని బంగ్లాదేశ్‌ మార్కెట్‌ గురించి చెబుతున్నాం. అదెక్కడుందా అని ఆలోచించకండి... ఇదిగో ఈ కథనం చూస్తే ఆ మార్కెట్‌ కబురేంటో మీకే తెలుస్తుంది.

బంగ్లాదేశ్‌ మార్కెట్‌.... ఇక్కడ అన్ని చవకే!

By

Published : May 26, 2019, 7:16 AM IST

బంగ్లాదేశ్‌ మార్కెట్‌.... ఇక్కడ అన్ని చవకే!

హైదరాబాద్‌... ఇక్కడ అన్ని రకాల వస్తువులకు ఒక్కో మార్కెట్‌ ఫేమస్‌. బేగం బజార్‌లో డ్రైఫ్రూట్స్‌... లాడ్‌బజార్‌లో గాజులు.. పాన్‌ మండిలో పాన్‌.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు. భాగ్యనగరం పేరుకు తగ్గట్టుగానే అన్ని రకాల వారిని అక్కున చేర్చుకుని బతుకు భాగ్యాన్ని కల్పిస్తుంది. వస్త్రాలకు, ఇతర సామగ్రికి పెట్టింది పేరు సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌. ఇలాంటిదే ముషీరాబాద్‌లోని మరో బజార్‌ బంగ్లాదేశ్‌ మార్కెట్‌. ఇక్కడ గుండు పిన్ను నుంచి పట్టుచీరల వరకు... చెప్పుల నుంచి చెవి దుద్దుల వరకు దొరకని వస్తువంటూ ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిందే!

50శాతం తక్కువ ధరకే..!

ఈ మార్కెట్‌ ఇవాల్టిది కాదు. సుమారు 70 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో పలువురు వ్యాపారులు బంగ్లాదేశ్‌ నుంచి వస్తువులు తీసుకువచ్చి ఇక్కడ అతి తక్కువ ధరలకే అక్రమంగా విక్రయించేవారు. అది కాస్తా.. బంగ్లాదేశ్‌ మార్కెట్‌గా స్థిరపడిపోయింది. సాధారణ మార్కెట్‌తో పోలిస్తే ఇక్కడ సుమారు 50 శాతం తక్కువకే వస్తువులు దొరుకుతాయి.

అన్ని రకాల వస్తువులు ఒకే చోట...

ఇక్కడ చీరలు, నగలు, హ్యాండ్‌ బ్యాగులు, డ్రెస్‌ మెటీరియల్స్‌, కాస్మొటిక్స్‌.. ఇలా ఒకటేమిటీ అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి. ఇంట్లోకి కావాల్సిన ప్లాస్టిక్‌ వస్తువులు, కర్టెన్లు, దుప్పట్లు, పిల్లల ఆటబొమ్మలు అత్యంత చవకగా అందుబాటులో ఉంటాయి. విభిన్నమైన డిజైన్లు, రంగుల్లో ఉన్న వస్త్రాలు, నగలు అంతకు మించి అందుబాటులో ఉండే ధరలు... బంగ్లాదేశ్ మార్కెట్‌ వైపు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఇక్కడికి వచ్చి అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తామంటున్నారు మహిళలు.

సరికొత్త డిజైన్లు...

అతి తక్కువ ధరల్లో అందమైన వస్త్రాలు, నాణ్యమైన వస్తువులను అందిస్తూ... దశాబ్దాలుగా ప్రజల నుంచి మంచి ఆదరణ సంపాదించుకుంటోంది బంగ్లాదేశ్ మార్కెట్. అందుబాటులో ఉండే ధరలు... సరికొత్త డిజైన్లే ఈ మార్కెట్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఇదీ చూడండి:హలీం.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు

ABOUT THE AUTHOR

...view details