ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని ప్రధాన నదులైన శారద, వరాహ, తాండవలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. వీటి ప్రవాహ ఉద్ధృతికి పాయకరావుపేట, ఎలమంచిలిలలో కొన్ని లోతట్టు కాలనీలు నీటమునిగాయి. తీర ప్రాంతంలో పలు మత్స్యకార బోట్లు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి.
ఏపీ: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడ - విశాఖలో వర్షం తాజా వార్తలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. బంగ్లాదేశ్‌కు చెందిన ఎంవి హెచ్ టి 194 కార్గో ఓడ యాంకర్లను కోల్పోయి విశాఖ ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దీనిని మళ్లీ సముద్రంలోకి పంపేందుకు కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది.
ఏపీ: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడ
నీటిలో కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ ఓడ...
బంగ్లాదేశ్‌కి చెందిన ఓ వాణిజ్య ఓడ యాంకర్లు కోల్పోయి ఆర్ధరాత్రి విశాఖలోని సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీనిని మళ్లీ సముద్రంలోకి పంపేందుకు కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది.
ఇదీ చదవండి నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిన తీవ్రవాయుగుండం