తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ సాంకేతిక బృందాన్ని నియమించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల్లో లోపభూయిష్ట డిజైన్ల కారణంగా వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూగర్భ పంప్ హౌజ్ నిర్మాణం కోసం పేలుళ్లు జరపడం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్ మునిగిపోయిందని మండిపడ్డారు. భద్రతా నిబంధనలను విస్మరించి పీఆర్ఎల్ఐఎస్ భూగర్భ పంపుహౌస్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిందని విమర్శించారు. ఫలితంగా కేఎల్ఐఎస్ పంపుహౌస్‌కు ప్రమాదం జరిగిందని.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమన్నారు.