తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే అడ్డుకుంటాం' - భాజపా గెలుపుపై బండి సంజయ్​ స్పందన

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో నగర ప్రజలు గురుతర బాధ్యత భాజపాపై పెట్టారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన భాజపా ఈ ఎన్నికల్లో 50 స్థానాల దగ్గరకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు పునరావృతం అవుతాయంటున్న బండి సంజయ్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి జ్యోతికిరణ్‌ ముఖాముఖి.

bandi-sanjay-said-we-will-prevent-anti-people-policies-being-adopted-in-telangana
'ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే అడ్డుకుంటాం'

By

Published : Dec 4, 2020, 11:06 PM IST

'ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే అడ్డుకుంటాం'

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన ప్రజలకు భాజపా తరపున బండి సంజయ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. గతంలో నాలుగు సీట్ల నుంచి 50 దగ్గరకు రావడం ఆనందంగా ఉందన్నారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలి.. కానీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే ఈ విధంగా గుణపాఠం చేబుతారని సంజయ్​ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామన్నారు. వాటిని అమలు పరిచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. 2023 ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మాది కుటుంబపాలన కాదు. మేము అవినీతికి దూరంగా ఉంటామని వెల్లడించారు.

ఇదీ చూడండి :జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 47 స్థానాల్లో భాజపా గెలుపు

ABOUT THE AUTHOR

...view details