తెలంగాణ

telangana

ETV Bharat / state

bandi sanjay: 'పీవీని కాంగ్రెస్‌ అవమానించింది' - bandi sanjay comments on congress party

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్(bandi sanjay)​ పీవీకి నివాళులర్పించారు. రాష్ట్రం, దేశంలో ఆయన చేసిన సేవలు మరులేనివని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్​ పార్టీ పీవీకి తగిన గుర్తింపు ఇవ్వలేదని బండి సంజయ్‌(bandi sanjay) ఆరోపించారు.

pv narasimha rao news, bandi sanjay latest news
bandi sanjay: 'పీవీని కాంగ్రెస్‌ అవమానించింది'

By

Published : Jun 28, 2021, 2:08 PM IST

పీవీ నరసింహారావు బహుభాషా కోవిదుడు, పాలన దక్షుడు, జ్ఞాన సంపన్నుడని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌(bandi sanjay) అన్నారు. ఆయన శత జయంతి సందర్భంగా ఎంపీ నివాళులర్పించారు. పీవీని స్మరించుకుంటూ ఆయన ఆలోచనలను గుర్తుచేశారు.

అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎన్నుకై అనేక సేవలందించారని పేర్కొన్నారు.

పార్టీలో చురుగ్గా పనిచేసి అనేక పదవులు చేపట్టిన పీవీని... కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం తీవ్రంగా అవమానించిందని ఆరోపించారు. మాజీ ప్రధాని మృతి చెందిన తర్వాత కాంగ్రెస్‌ నాయకత్వం తగిన రీతిలో ఆయనకు నివాళులు అర్పించలేదని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details