బంగాల్‌లో భాజపా కార్యకర్తలపై టీఎంసీ దాడులు చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దాడులను నిరసిస్తూ... హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. బంగాల్‌లో 77 స్థానాల్లో గెలిచి తమ బలం పెంచుకున్నామని తెలిపారు. భాజపా నుంచి ఎవరు వెళ్లిన దాడులు చేస్తున్నారని విమర్శించారు.
మా సహనాన్ని పిరికితనంగా భావించవద్దు: బండి సంజయ్ - bandi sanjay
బంగాల్‌లో భాజపా కార్యకర్తలపై దాడులను బండి సంజయ్ ఖండించారు. దాడులను నిరసిస్తూ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని మమత కూనీ చేస్తున్నారని ఆరోపించారు.
మా సహనాన్ని పిరికితనంగా భావించవద్దు: బండి సంజయ్
ప్రజాస్వామ్యాన్ని మమత కూనీ చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. విదేశీ నిధులతో మమతా బెనర్జీ ఎన్నికల్లో గెలిచారన్నారు. భాజపా సహనాన్ని పిరికితనంగా భావించవద్దని హెచ్చరించారు.
ఇదీ చూడండి:కొత్త సచివాలయ నిర్మాణ పనులపై కొవిడ్ ప్రభావం