Bandi Sanjay Open Letter to KCR: సీఎం కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువత కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు.
Bandi Sanjay Open Letter to KCR: ఆ విషయంపై సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ - Bandi Sanjay Open Letter to CM KCR
Bandi Sanjay Open Letter to KCR: ప్రజా సమస్యలపై నిలదీస్తూ.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి సమస్యలను వివరిస్తూ.. ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
నియోజకవర్గానికొక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని సూచించారు. కోచింగ్ కేంద్రాల్లో అల్పాహారం, భోజనం ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్ చేశారు. ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఫీజులు నియంత్రించాలన్నారు. టీశాట్, ప్రభుత్వ స్టడీ సర్కిల్స్, కోచింగ్ కేంద్రాల ద్వారానే శిక్షణ ఇవ్వాలని లేఖలో వివరించారు.