తెరాస ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక ప్రభుత్వమని.. కేసీఆర్ ఎస్సీఎస్టీ ద్రోహి అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. భూపాలపల్లి జిల్లా మల్లారంలో యువకుని హత్య గురించి తెలుసుకోవడానికి వెళ్లిన భాజపా ప్రతినిధి బృందాన్ని దారి మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
రేవెల్లి రాజబాబు అనే యువకుడిని తన కుటుంబ సభ్యుల ముందే అరాచకంగా కొట్టి చంపడం హేయమైన చర్యని.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వాటికి స్థానం లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.