తెలంగాణ

telangana

ETV Bharat / state

తక్షణమే కొత్త వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలి: బండి సంజయ్ - పీఆర్​సీ అమలు

ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కొత్త వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై ఒకటి నుంచి జీతాలు చెల్లించాలన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : Jan 16, 2023, 8:10 PM IST

వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై ఒకటి నుంచి జీతాలు చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. స్వరాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కులను కాపాడాల్సింది పోయి.. అడుగడుగునా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించకుండా ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.

సీఆర్‌ బిస్వాల్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తొలి పీఆర్​సీ నివేదికను 2018 జులై ఒకటి నుంచి అమలు చేయాల్సినప్పటికీ.. 21 నెలలుగా అమలు చేయకుండా ఉద్యోగ ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టారని బండి సంజయ్ మండిపడ్డారు. ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కొత్త వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని.. లేనిపక్షంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన ఉద్యమిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details