తెలంగాణ

telangana

ETV Bharat / state

శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్న సీఎం: బండి సంజయ్‌ - హైదరాబాద్ తాజా వార్తలు

bandi sanjay fires on cm: రాష్ట్రంలో సీఎం శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కర్మన్​ఘాట్ హనుమాన్ ఆలయం దర్శించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

bandi sanjay
బండి సంజయ్‌

By

Published : Mar 8, 2022, 6:56 PM IST

bandi sanjay fires on cm: కేసీఆర్ పాలనలో సరిగా విధులు నిర్వహించలేకపోతున్నామని పోలీసులు బాధపడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. సీఎం తన పాలన గురించి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. హైదరాబాద్​లోని కర్మన్‌ఘాట్‌ హనుమాన్ ఆలయాన్ని బండి సంజయ్‌ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రసిద్ధిగాంచిన కర్మన్‌ఘాట్‌ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు.

"రాష్ట్రంలో సీఎం.. శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారు. దీంతో పోలీసులు విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. కర్మన్​ఘాట్​ ఘటనలో గోరక్షకులపై పెట్టిన కేసులన్ని ఎత్తివేయాలి. రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలి." -బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

గతంలో కర్మన్​ఘాట్​ ఘటనలో గోరక్షకులపై పెట్టిన కేసులన్ని ఎత్తివేయాలని బండి సంజయ్‌ డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు.

బండి సంజయ్

ఇదీ చదవండి: Bandi Sanjay on Budget: 'సస్పెన్షన్​ను నిరసిస్తూ రేపటి నుంచి ఆందోళనలు'

ABOUT THE AUTHOR

...view details