రాష్ట్రంలోని రెండు రహదారులను నేషనల్ హైవేలుగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ రహదారులుగా ప్రకటించిన కేంద్ర రోడ్లు, రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. మహబూబ్ నగర్ నుంచి కొడంగల్, తాండూరు, కర్ణాటకలోని చించొలీ ద్వారా కర్ణాటకలోని బాపూర్ జంక్షన్‌తో అనుసంధానం చేస్తున్న ఈ రోడ్డుకు జాతీయ రహదారి167-ఎన్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో మరో రెండు జాతీయ రహదారులు.. బండి సంజయ్ హర్షం
రాష్ట్రంలో మరో రెండు రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించడం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. అందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ జాతీయ రహదారులతో కనెక్షన్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
బండి సంజయ్ హర్షం, రాష్ట్రంలో మరో రెండు జాతీయ రహదారులు
కొత్తగూడెం నుంచి ఇల్లందు, మహబూబాబాద్, నెల్లికుదురు, తొర్రూరు, వలిగొండ ద్వారా హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌కు కలిసే రహదారిని ఎన్‌హెచ్-930పీగా ప్రకటించినట్లు తెలిపారు. ఈ రెండు రోడ్లు జాతీయ రహదారులుగా మారడం వల్ల రాష్ట్రంలో అత్యధిక ప్రాంతానికి కనెక్షన్ ఏర్పడుతుందన్నారు.
ఇదీ చదవండి:కేంద్ర నిధులపై తెరాస అసత్య ప్రచారం చేస్తోంది: డీకే అరుణ