ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మైనారిటీ ఓట్లతో రాజకీయ పబ్బం గడిపే ఓవైసీ.. కరోనా వైరస్ నివారణకు పిలుపునివ్వకపోవటం సిగ్గుచేటన్నారు.
ఓవైసీ ఆసుపత్రిని ఐసోలేషన్ వార్డుగా మార్చాలి: సంజయ్ - బండి సంజయ్
రాష్ట్ర ప్రభుత్వం ఓవైసీ ఆసుపత్రిని వెంటనే ఐసోలేషన్ వార్డుగా మార్చాలని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
BJP MP Bandi sanjay Latest news
గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడిని ఖండించకపోవటం, కరోనా బారినపడిన ముస్లిం సమాజాన్ని రక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం ఓవైసీకి తగదని బండి సంజయ్ విమర్శించారు.
Last Updated : Apr 2, 2020, 1:25 PM IST