తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay on KCR: 'సీఎం సొంత జిల్లాలోనే ఆత్మహత్యలు.. రైతుల కోసం​ ఏం చేశారు.?'

సీఎం కేసీఆర్​కు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay on KCR) మండిపడ్డారు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ గంటపాటు అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. అబద్ధాల కోసమే ప్లీనరీలు, బహిరంగ సభలు, మంత్రి వర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ నిన్న మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర భాజపా తీరుపై విమర్శలు చేసిన నేపథ్యంలో బండి సంజయ్‌ హైదరాబాద్​ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Bandi Sanjay on KCR
బండి సంజయ్​

By

Published : Nov 8, 2021, 2:10 PM IST

Updated : Nov 8, 2021, 3:51 PM IST

ఈ ఏడేళ్లలో రైతుల కోసం సీఎం కేసీఆర్​ ఏం చేశారో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay on KCR)​ నిలదీశారు. మూడేళ్లు అవుతున్నా రుణమాఫీ చేయలేదని.. ఎక్కడ రుణమాఫీ చేశారో స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు. సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతులు కార్లలో ఎక్కడ తిరుగుతున్నారో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్​ చేశారు. ఒకసారి వరి వేయొద్దని, ఇంకోసారి పత్తి వేయొద్దని రైతులను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే హుజురాబాద్‌ ఉపఎన్నికలో ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్​పై తీవ్ర స్థాయిలో ఆయన(Bandi Sanjay on KCR)​ ధ్వజమెత్తారు.

కేసీఆర్​కు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే.: బండి సంజయ్​

ప్రతి గింజా నేనే కొంటా.. కేంద్రంతో పనేంటని కేసీఆర్ గతంలో అన్నారు. ఏడేళ్ల నుంచి కేంద్రమే కొంటుందని అంటే.. కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి. 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారో లేదో నిపుణులతో కలిసి తేల్చాలి. వానాకాలంలో పంట కొంటామని కేంద్రం చెప్పలేదని కేసీఆర్ చెబుతున్నారు. దీనిపై ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ లేఖ రాసింది. 40లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 60లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొంటామని కేంద్రం లేఖ ఇచ్చింది. దిల్లీకి వెళ్లి యుద్ధం చేస్తానని గతంలోనూ కేసీఆర్ హడావిడి చేశారు. మార్కెట్ల కమిటీలను రద్దు చేస్తామని లేఖలో ఎక్కడైనా ఉందా.? కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని లేఖలో ఎక్కడైనా చెప్పారా? -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

తెలంగాణకే అధిక వాటా

24రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు తగ్గించినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎందుకు తగ్గించడంలేదని బండి సంజయ్(Bandi Sanjay on KCR)​​ నిలదీశారు. పెట్రో అమ్మకాల ద్వారా కేంద్రానికి లీటర్​కు వ్యాట్‌ ద్వారా రూ. 27 వస్తే రాష్ట్రానికి రూ. 28 వస్తుందన్నారు. తిరిగి రాష్ట్రానికి కేంద్రం మళ్లీ రూ. 12 అందజేస్తుందని వివరించారు. కేంద్రానికి రాష్ట్రం వివిధ పన్నుల రూపంలో రూ. 2లక్షల 72వేల కోట్లు కడుతోందని.. కేంద్రం తిరిగి రాష్ట్రానికి 2లక్షల 52వేల 908 కోట్లు చెల్లిస్తోందని తెలిపారు. 2015లో పెట్రోల్‌పై 4 శాతం, డీజిల్‌పై 5 శాతం వ్యాట్ పెంచలేదా అని బండి సంజయ్​(Bandi Sanjay on KCR)​ ప్రశ్నించారు.

ట్రిబ్యునల్​ కోసం ఒత్తిడి

కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి కేసీఆర్​ ద్రోహం చేశారని బండి సంజయ్(Bandi Sanjay on KCR)​​ ఆరోపించారు. తెలంగాణ వాటా కింద 575టీఎంసీలు రావాల్సి ఉంటే కేవలం 299టీఎంసీలకు ఒప్పుకుంటూ సంతకం చేశారని మండిపడ్డారు. కేంద్రం ట్రిబ్యునల్ తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో కేసు విత్ డ్రా చేసుకుంటేనే ట్రిబ్యునల్ వేస్తామని కేంద్రం స్పస్టం చేయడంతో 8నెలల క్రితం కేసు ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. ఏడేళ్ల నుంచి కేసు ఎందుకు ఉపసంహరించుకోలేదని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: Minister KTR : 'విమర్శలు చేయడం సులభం.. సేవ చేయడమే కష్టం'

Last Updated : Nov 8, 2021, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details